Saturday, May 11, 2024
- Advertisement -

ఐశ్వ‌ర్య రాయ్‌తో రొమాన్స్ చేయ‌ల‌ని ఉంది – విల్‌ స్మిత్‌

- Advertisement -

విల్‌ స్మిత్ హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ హీరో. ఆ మ‌ధ్య విల్‌ స్మిత్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది. ఇటీవ‌ల కాలంలో విల్‌ స్మిత్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో మ‌నోడి క్రేజ్ కాస్తా త‌గ్గింది.విల్‌ స్మిత్ ఒక్క న‌ట‌న‌తోనే ఆగిపోలేదు. నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్‌ హాలీవుడ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు స్మిత్. తాజాగా హిందూస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్‌ ఫర్హాన్‌ అక్తర్‌తో మాట్లాడుతూ విల్‌ స్మిత్ త‌న‌లోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు.

ఈ నటుడికి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్‌ స్మిత్‌, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నమని, కానీ అది ఇప్పటి వరకు జరుగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఇలా ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందనే ఇష్టాన్ని తెలియజేశారు. ఐయామ్‌ లెజెండ్‌, ఐ, రోబోట్‌, ఇండిపెండెన్స్‌ డే, మెన్‌ ఇన్‌ బ్లాక్‌ వంటి సినిమాల్లో విల్‌ స్మిత్‌ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -