Wednesday, May 1, 2024
- Advertisement -

తేజ‌స్వి క్యెరెక్ట‌ర్ అలాంటిదే..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ గ‌డిచి చాల‌కాల‌మైనా ఇంకా దాని గురించే చ‌ర్చ న‌డుస్తుంది. బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్నర్‌గా కౌశ‌ల్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డాన్ని హౌస్‌మెట్స్ ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికే ప‌లువు కౌశ‌ల్ విన్న‌ర్ అవ్వ‌డాన్ని వ్యతిరేకించారు కూడా. తాజాగా కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డంపై స్పందించాడు సామ్రాట్‌. బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో మొద‌టి ఫైన‌ల్‌కు వెళ్లింది సామ్రాటే. కౌశల్ గురించి మాట్లాడుతూ.. హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ బలం ఏమిటో తెలియలేదని, బయటకొచ్చిన తరువాత ఆయనకున్న ఫాలోయింగ్ చూసి షాక్ అయినట్లు చెప్పాడు సామ్రాట్.

మొదటి నుండి హౌస్ లో ఎంతో క్రమశిక్షణతో కౌశల్ ఉన్నాడని, ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి గురించి కూడా చెప్పుకొచ్చాడు సామ్రాట్‌. తేజస్వితో అతడు ప్రేమాయణం నడిపించాడనే మాటలు బాగా వినిపించాయి. తేజస్విది టామ్ బాయ్ క్యారెక్టర్ అని, హౌస్‌లో ఉన్న రోజులు బాగా ఇరిటేట్ చేసిందని అన్నారు. తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని.. తనీష్ కి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో.. తేజస్వితో ఉన్నది కూడా అలాంటి బంధమేనని.. అంతకుమించి తమ ఇద్దరి మధ్య ఏం లేదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -