యాంక‌ర్ ర‌విపై కేసు..క్లారిటీ ఇచ్చిన యాంక‌ర్‌!

ప్ర‌ముఖ టీవీ యాంక‌ర్ ర‌విపై హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేష‌న్‌లో ఓ కేసు న‌మోదైంది.ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ను యాంకర్ రవి బెదిరించాడని, అతడిపై దాడికి పాల్పడ్డాడని ఇచ్చిన కంప్లైంట్ తో రవిని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అతడిని ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.ఈ వార్తలపై తాజాగా స్పందించాడు రవి.

తనపై వస్తోన్న వార్తలను ఖండించాడు. ఆ వార్తలను ఎవరూ నమ్మొద్దని చెప్పాడు. ”నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేదు.. పోలీసులు విచారణ చేయలేదు. నేను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నాను. ఓ ఛానెల్ కి సంబంధించి దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాను” అంటూ వెల్లడించాడు.