Tuesday, May 14, 2024
- Advertisement -

కేంద్ర సంస్థ‌తో ద‌ర్యాప్తు జ‌రిపించండి..కేంద్ర‌ హోంమంత్రికి వైసీపీనేత‌ల విన్న‌పం

- Advertisement -

జగన్‌పై దాడి, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ని క‌లిశారు. జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిగురించి త‌ర్వాత కేసు విచార‌ణ ప‌రినామాల గురింది రాజ్‌నాథ్‌కు వివ‌రించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని..నిష్ఫక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే కేంద్ర సంస్థే దర్యాప్తు చేయించాల‌ని విజ్ణ‌ప్తి చేశారు.ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు.

వైఎస్ జగన్‌పై దాడి ఘటన కేసు కేంద్ర పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చార‌ని వైసీపీనేత‌లు తెలిపారు. మరో నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో.. హీరో శివాజీకి జరుగుతున్న విషయాలు ముందే ఎలా తెలుసో దానిపైనా విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. నిందితుడిని వైసీపీ సానుభూతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. చంద్రబాబు గత చరిత్రపైనా విచారణ జరపాల్సిందిగా రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.

దాంతో పాటు తిత్లీ తుఫాన్ బాధితులను కేంద్రం ఆదుకోవాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు ఇతర నేతలు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -