అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లును ఆకట్టుకుంటుంది. జాన్వీ కపూర్ తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది జాన్వీ కపూర్.న్ జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.చిన్నప్పుడు జాన్వీ.. ఖుషీతో కలిసి టీవీ ముందు డాన్స్ చేస్తోన్న వీడియో అది. ఈ ఇద్దరు సిస్టర్స్ తమ క్యూట్ డాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘చిన్ననాటి నుండి నీ నుండి నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాననే దానికి ఉదాహరణ ఇది.
అయినా.. నువ్వంటే నాకెంతో ఇష్టం. ఎంత అంటే నువ్వు ఎప్పటికీ ఊహించలేనంతగా… హ్యాపీ బర్త్ డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో పలు సందర్భాల్లో కూడా జాన్వీ తన చెల్లెలు ఖుషీ గురించి చెప్పింది. తనకి ఎంతో సపోర్ట్ ఇస్తుందని.. చెల్లి అనడం కంటే అక్క అనడం బెటరేమో అంటూ వెల్లడించింది. ఇప్పుడు ఖుషీ కపూర్ కూడా జాన్వీలానే హీరోయిన్ అవ్వడానికి సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని సమాచారం.
