తమిళ స్టార్ హీరో విజయ్,స్టార్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ సినిమా దీపావళి సందర్బంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు పండుగ చేసకుంటున్నారు.అయితే వారి ఆనందానికి ఎక్కువ సేపు నిలవలేదు.సర్కార్ విడుదలైన కొద్ది గంటల్లోనే HD ప్రింట్ ఆన్ లైన్‌లో ప్రత్యక్షం కావడంపై చిత్ర యూనిట్‌తో పాటు యావత్తు ఇండస్ట్రీ మొత్తం షాక్ గురైంది.
మాములుగానే సినిమా విడుదలైన రెండు,మూడు రోజులు తరువాత ఏ సినిమా అయిన పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెడతారు.అవి థియోటర్లలో ఫైరసీ కావడం వల్ల వాటిలో అంత స్పష్టత ఉండదు.కాని విజయ్ సర్కార్ విషయంలో అలా జరగలేదు. సినిమా విడుదల రోజునే HD ప్రింట్ ఆన్ లైన్‌లో ప్రత్యక్షం కావడం వెనక ,ఎవరో తెలిసిన వారే ఉంటారని చిత్ర యూనిట్ భావిస్తుంది.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో చిత్ర దర్శక -నిర్మాతలు ఉన్నారని తెలుస్తుంది.
