Monday, April 29, 2024
- Advertisement -

టీ20 సిరీస్ పై క‌న్నేసిన టీమిండియా…

- Advertisement -

ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో టీమిండియా మరో సిరీస్‌పై కన్నేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే రెండో మ్యాచ్ నెగ్గి సీరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని తహతహలాడుతోంది. వెస్టిండీస్‌తో మంగళవారం లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారతరత్న శ్రీ అటల్‌ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’లో రెండో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

వ‌న్డే, టెస్ట్ సిరీస్‌ను విండీస్ కోల్పోయి తీవ్ర నిరాశ‌లో ఉంది. మరోవైపు కోల్‌కతా టీ20 ఓటమికి బదులు తీర్చుకోవాలని కరీబియన్ టీమ్ భావిస్తోంది. రోహిత్ సేన..కార్లోస్ బ్రాత్‌వైట్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్లు సై అంటే సై అంటున్నాయి.

సునాయాసంగా నెగ్గాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ను పోరాడి నెగ్గిన టీమిండియా…సెకండ్ టీ20లోనూ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. మొద‌టి మ్యాచ్‌లో టాప్ ఆర్డ‌ర్ విఫ‌ల‌మైనా దినేష్ కార్తీక్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో పాటు కృనాల్ పాండ్య ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా టీ20లో విజయాన్ని నమోదు చేసింది.

ప్రత్యర్థి ప్రతిభ కంటే మ్యాచ్, పిచ్‌ పరిస్థితులను పట్టించుకోకుండా ఆడటమే కోల్‌కతాలో వెస్టిండీస్‌ పరాజయానికి ప్రధాన కారణమైంది. ఫామ్‌లో ఉన్న షై హోప్‌ అనవసర రనౌట్‌ మరింత దెబ్బతీసింది. బౌలింగ్‌లోనే జట్టు ప్రతిఘటన చూపగలిగింది. కెప్టెన్‌ బ్రాత్‌వైట్, పియర్‌ పొదుపైన బౌలింగ్‌కు తోడు పేసర్‌ థామస్‌ మెరుపు స్పెల్‌ ఆశలు రేపినా అది విజయానికి సరిపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -