బాలీవుడ్ స్వీట్ కపూల్ షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్‌లు మళ్లీ వార్తల్లో నిలిచారు.వీరిద్దరు తమ వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఏమాత్రం సందేహించరు.గతంలో తన భర్తకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ చెప్పి సంచలనం సృష్టించింది మీరా రాజ్ పుత్.తాజాగా లిప్ టూ లిప్ కిస్ పట్టుకున్న ఫోటోని షేర్ చేశాడు షాహిద్.దీపావళి శుభాకాంక్షలు చెబుతూ తమ పెర్సనల్ ఫోటోని పోస్ట్ చేశారు.సినిమాలో మాదిరి తన భార్యని లిప్ కిస్ చేస్తూ ఉన్న ఫోటోని షేర్ చేయడం విశేషం.
అయితే ఈ ఫోటోపై కొందరు మండిపడుతున్నారు.నీ భార్య అయినంత మాత్రనా ఇలా పబ్లిక్‌గా షేర్ చేయాలా అంటూ షాహిద్‌పై మండిపడుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కి ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు.