Saturday, April 20, 2024
- Advertisement -

‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ మూవీ రివ్యూ

- Advertisement -

బాహుబ‌లి సినిమానే టార్గెట్ చేసుకుని తెర‌కెక్కిన సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌,అమితాబ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా ఈ రోజు(గురువారం) విడుద‌ల అయింది.ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో క‌త్రినా కైఫ్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించింది. బ్రిటీష్ వాళ్ల కాలం నాటి కథతో వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ:
అది 1795. బ్రిటీష్ వాళ్లు..భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటున్న పీరియడ్. సంస్దానాలు, రాజ్యాలు హస్తగతం చేసుకుంటున్న వాళ్లకు ఎదురేలేకుండా పోతుంది. ఎవరైనా ఎదురుతిరిగితే చాలా దుర్మార్గంగా వ్యవరిస్తూంటారు. ఆ సమయంలో… ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య లాంటి క్యారక్టర్.. ఫిరంగి మల్లయ్య (అమీర్ ఖాన్) ది. అతను నక్క జిత్తులతో ఎవరినైనా బోల్తా కొట్టిస్తూంటాడు.ఎప్పుడు ఏ ఎత్తు వేసి.. ఎదుటివారిని చిత్తు చేస్తాడో … ఆ క్షణం దాకా అతనికి కూడా తెలియదు. ఇలాంటి మల్లయ్య..తన తెలివిని నమ్ముకుని బ్రిటీష్ వాళ్లకు తొత్తుగా మారి డబ్బులు సంపాదించుకుంటూంటాడు. థగ్స్ (దారి కాచి దోపిడీలు చేసే దొంగలు)తో స్నేహం చేసినట్లు నటించి..వారిని పట్టిస్తూ ఈనాములు కొట్టేస్తూంటాడు. ఇంత తెలివైన వాడిని, సాహసిని.. స్వాతంత్య్ర ఉద్యమం చేసేవారిపై ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బ్రిటీష్ వాళ్లకు వస్తుంది.

ఆ సమయంలో.. ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూంటాడు. అతన్ని పట్టుకోవాలి అంటే మల్లయ్యని ప్రయోగించాలనుకుంటారు. డబ్బుకు ఆశపడి మల్లయ్య కూడా ఓకే అంటాడు. తన తెలివితో మెల్లిగా ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) దళంలో జాయిన్ అవుతాడు. అంతేకాదు ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) నమ్మకాన్ని సైతం పొందుతాడు. టైమ్ చూసి ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) ని పట్టిస్తాడు. కానీ ఈ లోగా ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) లోని మంచితనం, స్వాతంత్ర్య కాంక్ష చూసి అచ్చమైన హిందుస్తాన్ గా మారతాడు. అక్కడ నుంచి ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) ని, ఆయన్ని దళాన్ని ఎలా కాపాడతాడు. బ్రిటీష్ వాళ్లకు అనుమానం రాకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని ఎలా చిత్తు చేసాడు, కత్రినా కైఫ్ పాత్ర ఏమిటి… అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమా మొత్తం బ్రిటిష్ కాలం నాటిది చెందిన‌దిగా ఉంటుంది.సినిమా మొదట్లోనే అస‌లు క‌థ ఏంటో చూసే ప్రేక్ష‌కుడుకి తెలిసిపోతుంది.దీంతో సినిమాపై ఆస‌క్తి త‌గ్గిపోతుంది.సినిమాలో పెద్ద‌గా ట్విస్ట్‌లు కూడా ఏమి లేక పోవ‌డం,బ్రిటిష్ కాలం అని చెప్ప‌డ‌మే త‌ప్ప చూడటానికి ఆ విధాంగా లేక‌పోవ‌డంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఇది ప్ర‌స్తుతం జ‌ర‌గుతుందా లేక బ్రిటీష్ కాలం అప్పుడు జ‌రుగుతుందా అనే అనుమానం క‌లుగుతుంది.

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్‌:
ఎప్ప‌టిలాగే త‌న‌దైన న‌ట‌న‌తో అద‌ర‌కొట్టాడు అమీర్ ఖాన్‌.సినిమా మొత్తం తానై న‌డింపించాడు. వ‌య‌స్సు పెరిగిన త‌న‌లోని న‌ట‌న ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరుపించాడు అమితాబ్‌.ఈ వ‌య‌స్సులో కూడా యుద్ధ స‌న్నివేశాల‌లో అద్భుతంగా న‌టించాడు అమితాబ్‌.ఇక క‌త్రినా కైఫ్ విష‌యానికి వ‌స్తే సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన‌ప్ప‌టికి త‌న డ్యాన్స్‌తో పిచ్చి ఎక్కిస్తుంది.క‌త్రినా వేసిన డ్యాన్స్ మూమెంట్స్‌కు థియోట‌ర్ల‌లో జ‌నాల‌కు ఈల‌లు మ‌త్రం గ్యారెంటీ అని చెప్ప‌వ‌చ్చు.

సాంకేతిక ప‌రిజ్ఞానం:
బ‌ల‌మైన క‌థ రాసుకున్న ద‌ర్శ‌కుడు ,ఆ క‌థ‌ను బ‌లంగా చిత్రిక‌రించ‌డంతో మాత్రం ఫెయిల్ అయ్యాడ‌నే చెప్పాలి.సినిమా సంగీతానికి వ‌స్తే పాట‌లు యావ‌రేజ్‌గా ఉన్న‌ప్ప‌టికి నేప‌థ్య సంగీతం మాత్రం ఆక‌ట్టుకుంది.సినిమాటోగ్ర‌ఫి బాగుంది.సాంకేతిక విలువ‌లు బాగున్నాయి.సినిమా కోసం నిర్మాత‌లు బాగానే క‌ష్ట‌ప‌డ్డారు.

బోటమ్ లైన్‌:
బాహుబ‌లి దాట‌ల‌నే తప‌న త‌ప్ప సినిమాలో మ్యాట‌ర్ లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -