అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. మంగళవారం జరుగనున్న ప్రతిష్ఠాత్మక మధ్యంతర ఎన్నికల్లో దాదాపు 12 మంది భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు. అమెరికాలో వలస వ్యతిరేక సెంటిమెంట్ తారాస్థాయికి చేరిన ప్రస్తుత దశలో బరిలో నిలిచిన వీరు ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన పద్మ కుప్ప డెమోక్రటిక్ అభ్యర్థిగా మిచిగాన్ రాష్ట్రంలో పోటీచేసి విజయం సాధించారు.
1965 అక్టోబర్ 8న భిలాయ్ లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఈమె మైసూరులో కొంతకాలం పెరిగారు.15 ఏళ్ల వయసులో భారత్ వచ్చి విద్యాభ్యాసం చేశారు. వరంగల్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ ఈసీ) ప్రస్తుతం నిట్ నుంచి 1984-85లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు
అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మహిళల హవా కొనసాగింది. మొత్తం 98మంది గెలవడం విశేషం. ఇందులో పద్మతోపాటు ఇండో అమెరికన్లు కూడా ఎన్నికయ్యారు. వీరిలో నీమా కులకర్ణి – మజ్ తబా – రామ్ విల్లివాలమ్ – అమీష్ షా – కెవిన్ థామస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వారున్నారు.
ఈ ఏడాది దాదాపు 100 మంది భారతీయ అమెరికన్లు అన్నిస్థాయిల్లోని ప్రభుత్వ పదవులకు పోటీలో ఉన్నారు. వీరిలో కొంతమంది అమెరికన్ కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ చట్టసభ సభ్యులను ఓడించి డెమోక్రాట్ల సంఖ్య పెరిగేలా చేయగలరు.
