Monday, May 13, 2024
- Advertisement -

ఏపీ క్యాబినేట్ విస్త‌ర‌ణ‌కు డేట్ ఫిక్స్ చేసిన బాబు…ఇద్ద‌రికి చోటు

- Advertisement -

క్యాబినేట్‌ను మ‌రో సారి పున‌ర్ వ్య‌వ‌స్తాక రించ‌నున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర‌లో ఉండ‌టంతో కొత్త క్యాబినేట్‌తో ఎన్నిక‌ల‌కు వెల్లాల‌ని బాబు నిర్ణ‌యించుకున్నారు.1వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కేబినెట్ విస్తరణ ప్రక్రియను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సారి మైనార్టీ, ఎస్టీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు.

క్యాబినేట్‌లో మైనారిటీల‌కు, ఎస్టీల‌కు ప్రాధాన్య‌త లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ఇప్పుడు వారికి మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో ఆ వ‌ర్గాల వారినుంచి వ్య‌తిరేక‌త రాకుండా బాబు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఎన్డీఏ నుండి టీడీపీ వైదొల‌గ‌డంతో ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ టీడీపీ మంత్రివర్గం నుండి వైదొలిగారు .దీంతో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్న బీజేపీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ ఖాళీలను మైనార్టీ, ఎస్టీ సామాజిక వర్గాలతో భర్తీ చేయాలని టీడీపీ భావిస్తోంది .

ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న ఫరూక్ కు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, మావోయిస్టుల చేతిలో హతమైన కిడారి సర్వేశ్వరరావు త‌న‌యుడిని మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌సి బాబు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -