పవన్ కళ్యాణ్, దాసరి సినిమాకు ముహూర్తం ఖరారు

దర్శకరత్న దాసరి నారాయణ రావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కలిసి సినిమా చేస్తున్నారని ఇప్పటి వరకు తెలిసిందే. అయితే అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో దాసరి కాని పవన్ కాని ఇప్పటి వరకు చెప్పలేదు..

కాని కోల్డ్‌ స్కామ్ ‌లో ముందస్తు బెయిల్ వచ్చిన దాసరి.. సంతోషంలో అక్టోబర్‌లో పవన్‌తో సినిమా తీస్తానని ఢిల్లీలో ప్రకటించాడు. దాసరి, పవన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎప్పటినుంచో పెంచుతున్న గడ్డం దాసరి సినిమా కోసమా..?? లేక త్రివిక్రమ్ సినిమా కోబలి కోసమా..?? అన్నదే ఆసక్తిగా మారిన అంశం. మొత్తానికి పవన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఇదొక శుభవార్త..