భారత్‌తో డిసెంబరులో సొంతగడ్డపై జరగనున్న టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా సెలక్టర్లు ఈరోజు 14 మందితో కూడిన జట్టుని ప్రకటించారు.టిమ్ పైన్ నేతృత్వంలోని 14 మందితో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెల్లడించింది. బాల్ ట్యాంపరింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, బెన్‌క్రాప్ట్ జట్టుకి దూరమవగా..వారి స్థానాలను యువ క్రికెటర్లతో నింపేదానికి ప్రయత్నిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.
డిసెంబరు 6 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. తొలి రెండు టెస్టుల కోసం ఈరోజు జట్టుని ప్రకటించారు. ఆసీస్ ప్రకటించిన జట్టులో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ మార్కస్ హారిస్‌కు చోటు దక్కింది. మరొకవైపు ఇప్పటివరకూ నాలుగు అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడిన క్రిస్ ట్రిమైన్‌కు సైతం టెస్టు జట్టులో స్థానం లభించింది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు .
టిమ్ పైన్(కెప్టెన్), మార్కస్ హారిస్, అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, హ్యాండ్ స్కాంబ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, హజల్‌వుడ్, నాథన్ లయన్, పీటర్ సిడెల్, క్రిస్ ట్రిమైన్
