Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ల్యాణ్ రామ్ గెట‌ప్ లీక్‌

- Advertisement -

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో ఆయ‌న పాత్ర‌ను బాల‌కృష్ణ పోషిస్తున్నారు.ఈ సినిమాని కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇప్పటికే కథానాయకుడు పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం మహానాయకుడు కోసం చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడిగా కనిపిస్తుండగా, సుమంత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నాడు.

ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో వీరు గెటప్ ఎలా ఉండబోతుందో పోస్టర్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా షూటింగ్ స్పాట్ లో కళ్యాణ్ రామ్ ఫోటో ఒకటి లీక్ అయింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్న కళ్యాణ్ రామ్ కి డైరెక్టర్ క్రిష్ సీన్ గురించి చెబుతున్న దృశ్యమది. తన తండ్రి మాదిరి డ్రెస్ చేసుకొని ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -