- Advertisement -

యోయో – ఆల్ ఇన్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్

- Advertisement -

సోషల్ మీడియా ప్రపంచంలో, సోషల్ మొబైల్ యాప్‌ల మార్కెట్లో ఇండియా శరవేగంగా వృద్దిని సాధిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ విప్లవం మరియు ఇంటర్నెట్ వినియోగదారులు విపరీతంగా పెరగడంతో సోషల్ మీడియా మార్కెట్ మరింత బలపడింది.

ఇండియాలో ఉన్న యువత ప్రధానంగా వినోదానికి సంభందించిన మొబైల్ యాప్‌లను ఎక్కువగా వినియోగిస్తోంది. ఫోటోలు మరియు వీడియోల రూపంలో వచ్చే వినోదభరితమైన కంటెంట్‌కు డిమాండ్ అధికమవుతోంది. దీంతో మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను ఒడిసిపట్టుకోవడానికి ఎన్నో మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఒక యూజర్‌కు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే అద్భుతమైన “యోయో యాప్” పరిచయం చేసాము.

యోయో యాప్ తొలిసారిగా 2018 జూన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది యువత ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ యాప్. విడుదలైన అనతి కాలంలోనే ఎంతో మంది దృష్టి ఆకర్షించింది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే 50 లక్షల యూజర్లను చేరుకుంది. యోయో యాప్ ప్రస్తుతం హిందీ, తమిళ మరియు తెలుగు భాషల్లో సేవలందిస్తోంది.

రాజ్ అనే షాప్‌కీపర్ రోజుకు రెండు గంటల సమయాన్ని యోయో యాప్‌లో వెచ్చిస్తున్నాడు. యోయో గురించి రాజ్ మాట్లాడుతూ, “యోయో యాప్‌లో పలు రకాల ఫోటోలు మరియు వీడియోలు లభిస్తాయి. సినిమాల్లోని చిన్న చిన్న వీడియోలు, ఫన్నీ వీడియోలు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ జిఫ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో నాకు నచ్చిన వాటిని నా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో వాట్సా‌ప్‌లో షేర్ చేస్తాను. యోయో యాప్ డైలీ లైఫ్‌లో చాలా ఉపయోకరంగా ఉంది మరియు దీన్ని యూజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ తన అనుభవాన్ని యోయోతో పంచుకున్నాడు.

యోయో యాప్ నుండి పవన్ కుమార్ మాట్లాడుతూ, “అధిక నాణ్యత మరియు వైవిధ్యభరితమైన కంటెంట్ యోయో యాప్ బిజినెస్‌లో కీలకం.” ప్రతి రోజు 2 లక్షలకు పైగా ఫోటోలు మరియు వీడియోలను యూజర్లు యోయో యాప్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో యూజర్ల సంఖ్య, పోస్టులు మరియు వాటి మీద జరిగే స్పందనల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతూనే ఉంది. యోయో అతి పెద్ద ఆన్‌లైన్ కమ్యూనిటి అనడంలో ఎలాంటి సందేహం లేదని” ధీమా వ్యక్తం చేశాడు.

జినా… ఓ సాధారణ స్టూడెంట్ కానీ తన యోయో అకౌంట్‌లో సుమారుగా 1 లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫాలోయర్స్ అంతా నా పోస్టులకు స్పందించడం నాలో సెలబ్రిటీ ఫీలింగ్ కలిగిస్తోంది. చాలా మంది ఫాలోయర్స్ నేను చేసే పోస్టులకు కామెంట్ చేసి, ఆ కామెంట్లకు నేనిచ్చే రిప్లే కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. అన్నింటికంటే, యోయో యాప్‌లో ఫాలోయర్స్‌ను పెంచుకోవడం మరియు యోయోలో పాపులర్ అయ్యేందుకు యోయో యాప్ స్టాఫ్ యూజర్లకు ఎంతగానో సహకరిస్తుంది. ఇందుకు జినా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యోయో సోషల్ యాప్ ద్వారా ఆత్మ గౌరవం, విశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని పెంచుకున్న యువత కొన్ని వేలల్లోనే ఉంది.

యోయో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, యోయో వీఐపి మరియు కాలేజ్ అంబాసిడర్ అధికారిక రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనుకునే స్మార్ట్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. యోయో యాప్ నుండి పవన్ కుమార్ మాట్లాడుతూ, “యోయో యాప్‌లో టాలెంటెడ్ యూజర్లను గుర్తించి మరియు ప్రోత్సహించడంలో యోయో యాప్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరూ ఫేమస్ కావచ్చని మేము నమ్ముతున్నామని,” చెప్పుకొచ్చాడు.

YoYo, YoYo App, YOYO All in One, Entertainment App, All in One Entertainment App
YoYo, YoYo App, YOYO All in One, Entertainment App, All in One Entertainment App

మీలో యోయో వీఐపి లేదా యోయో కాలేజ్ అంబాసిడర్ కావాలనే ఆసక్తి ఉంటే, క్రింది వివరాలను సంప్రదించగలరు:
a. యోయో కాలేజ్ అంబాసిడర్ ([email protected]/ Whatsapp +86 15221042667)
b. యోయో వీఐపి ([email protected]/ Whatsapp +91 9971935169)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -