బాలీవుడ్ సెక్సీడాల్ రాఖీ సావంత్ ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తుంది.పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందో లేక మరో దాని కోసం ఇలా చేస్తుందో ఎవరికి తెలియడం లేదు.రాఖీ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.రాఖీ దీపక్ కలాల్ అను అతనిని వివాహం ఆడనుంది. వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాఖీ కాబోయే భర్త దీపక్ కలాల్ మాములు రచ్చ చేయడం లేదు. రాఖీతో పెళ్లి అనగానే దీపక్ మరింత రెచ్చిపోయి పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టాడు. రాఖీ సావంత్ గతంలో తన అండర్ వేర్ కి తాళం వేసుకొని ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అండర్ వేర్ తాళం చెవి తన చేతికి చిక్కిందని నెటిజన్లకు చూపిస్తున్నాడు.
దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించాడు. పెళ్లికి ముందు ఇద్దరం కన్యత్వ పరీక్షలు చేయించుకోగా.. తామిద్దరం వర్జిన్లుగా తేలిందని ఇది తమకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెబుతూ సంబర పడిపోతున్నాడు. అసలు పెళ్లి జరుగుతుందో లేదో కానీ పెళ్లి పేరుతో వీరు చేసే రచ్చ కారణంగా సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. గతంలో పెళ్లి కోసం రాఖీ సావంత్ ఓ స్వయంవరం పెట్టిన సంగతి తెలిసిందే.అందులో విజయం సాధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి హ్యాండ్ ఇచ్చింది రాఖీ.మరి ఇప్పుడు అయిన దీపక్ కలాల్‌ను పెళ్లి చేసుకుంటుందో లేక మళ్లీ గతంలో లాగా హ్యాండ్ ఇస్తుందో చూడాలి.
