- Advertisement -

డ్రైవర్ కొడుక్కి దక్కిన గౌరవం

- Advertisement -

ఇది అరుదైన గౌరవం. ఇది అందరూ ఆనందపడే సమయం. ఇది అందరికి స్ఫూర్తి నింపే సందర్భం. మన రాష్ట్రం కాదు. అలాగని మన దేశమూ కాదు. కాని ఓ గొప్ప సంఘటన. బ్రిటన్ రాజధాని లండన్ మహా నగరానికి మేయర్ గా ఓ ముస్లీం ఎన్నికయ్యాడు. అంతేకాదు.. అతను పాకిస్తాన్ లో ఓ బస్సు డ్రైవర్ కొడుకు కావడం మరో విశేషం.

లండన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన సాధిఖ్ ఖాన్ఘనవిజయం సాధించారు. సాదిక్ పాకిస్తాన్ లో నివాసముంటున్న ఓ బస్సు డ్రైవర్ కుమారుడు కావడం విశేషం. ఈ విజయంతో లేబర్ పార్టీ లండన్ మున్సిపాలిటీలో ఎనిమిదేళ్ల తర్వాత తన జెండా ఎగురవేసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన సాదిక్ ఖాన్ తన ప్రత్యర్ధి,  కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్ స్మిత్ పై 9శాతం ఓట్ల ఆధిక్యంతో అపూర్వ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందాలంటే ఎవరికైనా 50 శాతం ఓట్లు రావాలి. అయితే సాదిక్ మాత్రం 46 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన సాదిక్ ను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -