- Advertisement -

చుక్కలు చూపిస్తున్న మహేష్ బాబు

- Advertisement -

ఓవర్సీస్ లో ఈ మధ్య వరుసగా తెలుగు సినిమాలకు సూపర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి, ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో మూడు సినిమాలు 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాయి. అలాంటి చోట మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఫ్లాఫ్ సినిమాలతోను అక్కడ 1 మిలియన్ డాలర్స్ కొట్టిన చరిత్ర ఉన్న మహేష్ లాస్ట్ ఇయర్ శ్రీమంతుడుతో 2.89 మిలియన్ మార్క్ ని టచ్ చేశాడు.

బాహుబలి తరువాత అక్కడ సెకెండ్ బెస్ట్ గా ఉన్న ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఫిక్స్ అయిన మహేష్ కి బ్రహ్మోత్సవంతో బంపర్ చాన్స్ లభించింది. మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉన్న ఈ సినిమాపై ఓవర్సీస్ లోనూ భారీ అంచనాలు ఉండటంతో టికెట్ రేట్లని ఓ రేంజ్ లో పెంచారక్కడ.

ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనర్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఒక్కో టికెట్ స్టార్టింగ్ రేటు 22$ పలకగా మహేష్ సినిమాకు ఏకంగా 30$ డాలర్స్ తో మొదలు అయ్యిందట. అయినా కూడా లెక్కచేయకుండా మహేష్ సినిమా టికెట్స్ దొరికితే చాలు అన్నట్లు ఎగబడి మరీ కొంటున్నారట అక్కడ. దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -