చియాన్ విక్రమ్‌కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అపరిచితుడు సినిమాతో తెలుగులో కూడా మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్.కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటు ముందుకుపోతున్నాడు విక్రమ్. ఇటీవలే సామి-2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.కదరం కొందన్ అనే సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్.
ఈ సినిమాను లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించడం ఒక విశేషం అయితే , ఈ సినిమాలో హీరోయిన్‌గా కమల్ రెండో కూతురు అక్షర హాసన్ నటించడం రెండో విశేషం. విక్రమ్‌ను డిఫరెంట్‌గా చూపుతోన్న ఈ లుక్ కూడా ఆసక్తిని రెకెత్తిస్తోంది. రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా తనకు మరో హిట్ ఇస్తుందని నమ్మకంతో ఉన్నాడు విక్రమ్.
- ఏపీకి భారీ వర్షసూచన..అలర్ట్!
- పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…
- భారత్‌లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?
- మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?
