బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి వార్త రాయని మీడియా లేదంటే అర్థం చేసుకోవాలి సల్మాన్ పెళ్లి ఎంత ఫేమస్సో. గతంలో చాలాసార్లు సల్మాన్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. తాజాగా మరోసారి సల్మాన్‌కు పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి.మరికొందరు సల్మాన్‌కు పెళ్లి కాకుండానే భార్య వచ్చేసిందని అంటున్నారు.గత కొంతకాలంగా రొమేనియా భామ లులియా వాంటూర్‌తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది.
లులియా కొన్నేళ్లుగా సల్మాన్‌తోనే ఉంటుందని సమాచారం. సల్మాన్-లులియా పెళ్లి చేసుకోలేదు అంతే కానీ.. భార్యాభర్తల్లాగే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారట. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.దీంతోనే సల్మాన్‌కు పెళ్లి అవ్వకుండానే భార్య వచ్చేసిందని అంటున్నారు. మరి దీనిపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
- డీఎస్పీ ఇన్బరాజ్‌గా సూర్య..
- ట్రోలింగ్ పై స్పందించిన రష్మిక
- ప్రియుడికి వీడియో కాల్ చేసి యువతి బలవన్మరణం!
- నీ తోడే ఉంటే రంగులు రంగులే!
- 12 జిల్లాలకు అర్నాబ్ తుపాను ముప్పు!
