Wednesday, April 24, 2024
- Advertisement -

అంతు చిక్క‌ని ర‌క్త కన్నీరు వ్య‌ధ‌ …..

- Advertisement -

సాధార‌ణంగా కంటికి సంబంధ‌మైన వ్యాధులు ఉన్న‌ప్పుడు కంటి నుంచి ర‌క్తం కార‌డం స‌హ‌జం. కంటి నుంచి ర‌క్తం కార‌డాన్ని హీమోలాక్రియా’ పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్న వారు ఏడ్చినపుడు రక్తం కారటం జరుగుతుంటుంది. కాని అండమాన్‌ నికోబార్‌ దీవికి చెందిన 22 ఏళ్ల యువకుడికి మాత్రం ఏడిస్తే రక్త కన్నీళ్లు వస్తాయి. దీంతో అత‌ను కొన్ని రోజులుగా న‌ర‌క‌య‌త‌న అనుభ‌విస్తున్నారు. ఆ యువకుడిలో హీమోలాక్రియా లక్షణాలు కనిపించకపో​వటం విశేషం.

తరుచుగా ఇలా కంటినుంచి రక్తం కారుతుండటంతో అతడు ‘అండమాన్‌ నికోబార్‌ ఐలాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ వైద్యులను సంప్రదించాడు. యువ‌కున్ని ప‌రీక్షించిన డాక్టర్‌ జేమ్స్ … హీమోలాక్రియా లక్షణాలు లేవని, దానితో పాటు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. 30శాతం మందికి ఇలా కారణం తెలియకుండా కంటినుంచి రక్తం కారుతుందని ఆయన తెలిపాడు.

కంటిలో సమస్యలు, తలకు గాయాలు, ముక్కునుంచి రక్తం కారటం, రక్త సంబంధమైన వ్యాధులు వంటి సందర్భాలలో కంటినుంచి రక్తం కారే అవకాశం ఉందని ‘న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’ పేర్కొంది. అయితే ర‌క్తం కార‌డానికి ఏంట‌నే విష‌యాన్ని డాక్ట‌ర్లు కూడా చెప్ప‌లేక‌పోయారు. శరీరం లోపల అంతర్గతం ఉన్న సమస్యల వల్ల ఇలా జరిగేందుకు ఛాన్స్ ఉందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -