- Advertisement -

రెండు మూడు రోజుల‌పాటు చ‌లి గుప్పిట్లో తెలంగాణా …

- Advertisement -

తెలంగాణాలో రోజు రోజుకీ ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతున్నాయి. చ‌లి తీవ్ర‌త పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఎప్పుడూ లేనంత స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. దీంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య‌న బారిన ప‌డుతున్నారు. చలి ప్రభావం మరింత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. గత ఏడాది కంటే తెలంగాణాలో ఉష్ణోగ్రత పడిపోయింది.

డిసెంబర్ 30, డిసెంబ్ర 31వ తేదీల్లో తెలంగాణలోని ఏయే జిల్లాల్లో చలి బాగా ఉంటుందో తెలియజేస్తూ ఓ వార్నింగ్ లెటర్‌ను విడుద‌ళ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే న‌గ‌రంలో పెరిగ‌నిన చ‌లి తీవ్ర‌త‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఉద‌యం, మ‌ద్యాహ్నం, సాయంత్రం అన్న తేడాలేకుండా చ‌లి త‌న పంజా విసురుతోంది. అటు ఉత్తరాది నుంచి రాష్ట్రం వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలి పింది.

గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అనేకచోట్ల సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తగ్గడం గమనార్హం. ప్రధానంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 8 డిగ్రీలు రికార్డు అయింది. రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు నమోదైంది.మ‌రో రెండు మూడు రోజుల పాటు చ‌లి ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌నుంది. దీంతో ప్ర‌జ‌లు త‌గు జాత్ర‌త్లు తీసుకోవాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికార‌లు తెలిపారు.

హైదరాబాద్, నిజామాబాద్‌లో 11 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదు అయిందంటే చాలు బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. స్వెట‌ర్లు, మ‌ఫ్ల‌ర్లు లేకుండా బ‌య‌ట‌కు రావ‌డంలేదు.

డిసెంబర్ 30న చలిగాలులు బాగా ఉండే జిల్లాలు..
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీసే అవకాశం ఉంది.

డిసెంబర్ 31న చలి ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీసే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -