నాగ చైతన్య కెరీర్ ఏమంత బాలేదనే చెప్పాలి. ఒక హిట్ కొట్టాడు అనుకునే లోపే రెండు, మూడు ప్లాప్‌లు ఇస్తున్నాడు. 2018 లో రెండు సినిమాలతో వచ్చాడు చైతన్య. శైలజరెడ్డి అల్లుడు,సవ్యసాచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ చైతన్య. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. చైతు ప్రస్తుతం సమంతతో కలిసి మజిలి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే పనిలో పడ్డాడు చైతన్య..బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘బరైలీ కీ బర్ఫీ’ రీమేక్ చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నట్లు తెలుగు సినీ వర్గాల సమాచారం. ‘బరైలీ కీ బర్ఫీ’ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రీమేక్ చేసి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య. మరి వరుస ప్లాప్‌లలో ఉన్న చైతన్యకు ఈ రీమేక్ మూవీ అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!