- Advertisement -

మగాడి దగ్గర ఆడవాళ్లు దాచే కొన్ని సీక్రెట్స్ ఇవి..!

- Advertisement -

చాలా విషయాలను రహస్యంగా ఉంచినప్పుడే బంధాలు అనుబంధాలు ఆనందమయం అవుతాయి. కొన్ని విషయాల గురించి తెలిసిపోతే.. అవతలి వారిపై ఆసక్తి తగ్గిపోవచ్చు. అభిప్రాయం మారిపోవచ్చు. వారికి దూరం అయిపోవాలనిపించవచ్చు.

బంధంలో బిగి సడలకూడదు అంటే.. కొన్ని విషయాలు రహస్యాలుగానే ఉండిపోవాలి. అంతుబట్టనివిగానే ఆగిపోవాలి. మరి ఈ విషయంలో ఆడవాళ్లు బాగా తెలివైన వారు. తన ప్రియమైన వాడి దగ్గర కూడా వారు కొన్ని రహస్యాలను దాచి పెడతారు. 

వాటి గురించి అతడితో డిస్కస్ చేయడానికి వారు పెద్దగా ఇష్టపడరు.. మరి అవేమిటి? అనే విషయం గురించి సర్వే చేశారు ఔత్సాహికులు. ఈ ఆన్ లైన్ బేస్డ్ సర్వే ప్రకారం.. ఆడవాళ్లు మగవాళ్ల దగ్గర దాచే విషయాలు ఇవి… 

ఆఫ్ ది రికార్డ్ టాక్: నలుగురమ్మాయిలు కలిస్తే ఏం మాట్లాడుకొంటారు? అనేది అబ్బాయిలకు ఒక అంతుబట్టని విషయం. ఖాళీ సమయాల్లో.. బాగా ఫ్రీ గా ఉన్నప్పుడు.. వారు ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారు..? అనేది తెలుసుకోవడం అబ్బాయిలకు తలకు మించిన భారం. ఇలాంటి సమయాల్లో అబ్బాయిలు ఏయే విషయాల గురించి మాట్లాడతారో అబ్బాయిలకు బాగా తెలిసిందే. కెరీర్, పొలిటిక్స్, స్పోర్ట్స్ వంటి విషయాలతో పాటు.. సన్నిహితులు అయిన అబ్బాయిలు సెక్స్ వంటి విషయాల గురించి కూడా ఫ్రీగా డిస్కస్ చేస్తారు. అయితే అమ్మాయిలు అలా మాట్లాడతారా లేదా? అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ను ఈ విషయం గురించి అడిగి చూడండి! 

మేకప్ సీక్రెట్స్: అమ్మాయిలు సాయంత్రం వరకూ అంతే ఉత్సాహంతో కనిపిస్తారు. అందం విషయంలో ఏం కష్టం పడతారో కానీ.. దాదాపుగా సాయంత్రం వరకూ ఫ్రెష్ గానే కనిపిస్తారు. అలాగే వారి దగ్గర వచ్చే సువాసన కూడా అంత ఈజీగా చెరిగిపోదు!  ఈ విషయంలో సీక్రెట్స్ ను తెలుసుకోవడం కూడా అబ్బాయిలకు అంత సులభం కాదు. ఆ గుట్టు గురించి అబ్బాయిలకు అమ్మాయిలు చెప్పరంతే! 

పాత బాయ్ ఫ్రెండ్ ఫై ఫీలింగ్స్: జీవితంలో కొన్ని బ్రేకప్స్ తప్పకపోవచ్చు. అమ్మాయిలు కూడా దీనికి మినహాయింపు కాదు. కొంతమంది వాళ్ల రిలేషన్ బ్రేకప్ కావొచ్చు. ఆ రిలేషన్ గాఢమైనది అయ్యుండొచ్చు లేదా.. జస్ట్ అట్రాక్షన్ అయ్యుండొచ్చు. దాని గురించి తన తర్వాతి రిలేషన్ షిప్ సమయంలో మాత్రం వారు ప్రస్తావించరు. పాత బాయ్ ఫ్రెండ్ పై తమకున్న ఫీలింగ్స్ గురించి మాట్లాడటానికి కూడా వారు ఇష్టపడరు! అవి వారి మనసులో మాత్రమే ఉండిపోతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -