Saturday, May 4, 2024
- Advertisement -

టీడీపీ నేతల మాటలే వారి పార్టీని నిండా ముంచేస్తాయా?!

- Advertisement -

ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయడం సహజమే. అధికార పార్టీలో తమకున్న పట్టును బట్టి పైరవీకారులు విజృంభిస్తూ ఉంటారు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాంటి ఛాన్స్ వచ్చింది. అయితే వీళ్లు ఇప్పుడు ఒకేసారి మరీ అతి చేసేస్తున్నారు. ఈ అతి తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..?! అనేదే సందేహంగా మారుతోంది! 

తమ నోళ్లకు పని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు. పార్టీ అధికారం లోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో వీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నిర్మొహమాటంటే.. నిర్భయంగా ప్రభుత్వాధికారులకు వీరు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు అందరూ తమ పార్టీ కార్యకర్తల మాటే వినాలని వీరు అంటున్నారు. ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదని.. అధికారులు అంతా తమ మాటకు కట్టుబడి ఉండాలని వారు చెబుతున్నారు.

బహిరంగ వేదికల మీద నుంచినే తెలుగుదేశం నేతలు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అధికారులు అంతా తమ మాటే వినాలని అంటున్నారు. తమ కార్యకర్తల మాట వినకపోతే తీవ్ర పరిణామాలు సంభిస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. తమ పార్టీకి సహకరించే అధికారులకు మంచి మంచి పోస్టింగులు ఇప్పిస్తామని కూడా మంత్రి వర్యులు హామీలు ఇస్తున్నారు… మరి తెలుగుదేశం పార్టీకి ప్రజలు అధికారాన్ని అప్పజెప్పింది దీనికేనా?! పచ్చ చొక్కాలు జేబులు నింపుకోవడానికి.. వారు వ్యవస్థను,ప్రభుత్వాధికారులను శాసించడానికేనా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది?! తెలుగుదేశం నేతలు ఇలా బహిరంగంగానే తమ తమ విశ్వరూపాలను ప్రదర్శించడం అయితే అంత మెచ్చుకోదగిన అంశం కాదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -