అతను ఓ హీరో , కాని అది కేవలం సినిమాలలో మాత్రమే. నిజ జీవితంలో అతను విలన్ అనే చెప్పాలి. కట్టకున్న భార్య పిల్లల్ని వదిలేసి ప్రియురాలితో జంప్ అయ్యాడు మన హీరో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పయపుళై అనే తమిళ సినిమా ద్వారా శివ హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్‌గా మారి కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సమయంలోనే తనకు పరిచియమైన ఓ అమ్మాయికు తనకు ఇంకా పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు.
శివకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.సదరు యువతితో ప్రేమలో ఉన్న మన హీరో సడన్‌గా కనిపించకపోవడంతో పరారయ్యాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది.ఇదివరకే పెళ్లయిన శివకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా ఆమెకు విడాకులు ఇవ్వలేదని తేలింది. దీంతో ఈ హీరోపై పలు చీటింగ్ కేసులు పెట్టిన పోలీసులు అతని కోసం వెతుకులాట మొదలు పెట్టారు.
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
- నిస్వార్ధంగా పని చేసినా గుర్తింపు లేదు..టీడీపీ నేత ఆవేదన
- బిగ్‌బాస్ 10వ సీజన్ వచ్చేస్తోంది!
