- Advertisement -

పవన్ రెంజ్ ఏంటో మరో సారి రుజువు అయింది!

- Advertisement -

పవన్ సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన పవన్ రెంజ్ మాత్రం తగ్గదు. ఎందుకంటే పవన్ అంటే అభిమానులో ఎప్పుడు హై రెంజ్ లోనే ఉంటాడు. టాలీవుడు లో ఉన్న డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కాని పవన్ తో ఒక్క సినిమా అయిన చేయాలి అని ఆశ పడుతుంటారు. అయితే పవన్ గత సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీసు వద్ద ప్లాప్ అయింది.

ఈ సినిమా రిజల్టు పట్టించుకోకుండా వెంటనే పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు. ఈచిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా తన స్నేహితుడు శరత్ మరార్ కే అప్పగించారు పవన్. ఈ సినిమా ద్వారా శరత్ నష్టాలతో పాటు సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను పూడ్చాలనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ మంచి తనమే పవన్ కళ్యాణ్ ను ఇంత పెద్ద స్టార్ ను చేసిందేమో!

పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ భారీగా తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుగు సినిమా పరిశ్రమలో ఇది హయ్యెస్ట్ అమౌంట్. మరి పవర్ స్టారా మజాకా! గతంలో పవన్ కళ్యాణ్ కి ‘ఖుషి’ లాంటి భారీ హిట్ తో పాటు ‘కొమురం పులి’ లాంటి భారీ ప్లాపును అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని సూర్య భిన్నంగా చూపించబోతున్నారని, ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో మంచి లవ్ స్టోరీతో ఉంటుందని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -