Saturday, May 18, 2024
- Advertisement -

ఇంటిపోరుతో అధికారానికి దూరం

- Advertisement -

తమిళనాడులో మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నా కరుణానిధి  కలలు కల్లలయ్యాయి. దీనికి కారణం ఆయన కుమారులే అని పరిశీలకులే కాదు కార్యకర్తలు కూడా అంటున్నారు. డిఎంకెలో ఆధిపత్య పోరు కారణమని, కుమారులిద్దరి వల్లే కరుణానిధి కల ఈడేరలేదని అంటున్నారు. పార్టీలో ఆధిపత్య పోరు కారణంగా  ముందు అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత తీరిగ్గా ఎన్నికలు దగ్గర పడిన తర్వాత తీసుకొచ్చారు. దీంతో ఆయన, ఆయన వర్గం ఎన్నికల్లో సీరియస్ గా పని చేయలేదు. తన వారికి టిక్కట్లు రాకుండా అడ్డుకున్నారంటూ స్టాలిన్ పై అళగిరి కోపం పెంచుకున్నారు. దీంతో దక్షిణ తమిళనాడులో డిఎంకె అభ్యర్దులు గెలవకుండా పావులు కదిపారంటున్నారు.

 ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమం అళగిరే నంటూ స్టాలిన్ భావిస్తున్నారు. ఎన్నికల ముందు అనవసరంగా ఆయన్ని తీసుకొచ్చారని వారు విమర్శిస్తున్నారు. ఇంతకు ముందు పార్టీలో ఓ వెలుగు వెలిగిన కనిమొళి 2జీ ప్పెక్ట్రమ్ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇది కూడా పార్టీ ఓటమిపై ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -