- Advertisement -

మహేష్ చేసిన తప్పు?

- Advertisement -

నిన్న మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రహ్మోత్సవం  గ్రాండ్‍గా రిలీజ్ అయింది. రిలిజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను అలరించడంలో విఫలం అయింది. 

అయితే మహేష్ బాబుని శ్రీకాంత్ అడ్డాల దారుణంగా మోసం చేసాడు. అసలు కథలో దమ్ము లేకుండా తలా తోక లేని కథనం తో బ్రహ్మోత్సవం అనే టైటిల్ పెట్టి మాయ చేసాడు శ్రీకాంత్ అడ్డాల. ఎంతసేపు నలుగురు కలిసి ఉండాలి అంటూ పనికిరాని కథతో సినిమా తీసాడు. బ్రహ్మోత్సవం టైటిల్ అనగానే ఉప్పొంగి పోయారు కానీ ఆ పేరు చెప్పి కోట్లాది డబ్బుని మంచి నీళ్ళ లా ఖర్చు పెట్టించి తీరా ఏం తీసాడయ్యా … అంటే ఏమి లేదు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే హిట్ తో మహేష్ ని మరోసారి దారుణంగా మోసం చేసాడు . ఇక మహేష్ అపరాధం కూడా ఉంది ఇందులో , శ్రీకాంత్ ని గుడ్డి గా నమ్మడం ముమ్మాటికీ మహేష్ చేసిన తప్పే ! షూటింగ్ సమయంలో మహేష్ ఆగ్రహం వ్యక్తం చేసాడని చాలాసార్లు కథనాలు వచ్చాయి అది నిజమే అని తాజాగా మన కళ్ళ ముందు ఉన్న బ్రహ్మోత్సవం చెప్పకనే చెబుతోంది . మహేష్ బాబు చేసిన అతిపెద్ద తప్పు శ్రీకాంత్ అడ్డాల ని నమ్మడం . అంతే !

బోలెడు మంది యంగ్ స్టర్స్ ఒక్క చాన్స్ … ఒక్క చాన్స్ అంటూ విభిన్న కథలను పట్టుకొని చెప్పులరిగేలా తిరుగుతున్న సమయంలో  తలా తోక లేని కథ , కథనాలతో వచ్చిన శ్రీకాంత్ తో మళ్ళీ సినిమా చేయడం మహేష్ చేసిన తప్పే మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -