Wednesday, May 15, 2024
- Advertisement -

పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం

- Advertisement -

కేరళలో తిరుగులేని విజయం సాధించిన సిపిఎం అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో ఆ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా చర్చించిన సభ్యులు చివరకు కేరళ 22 ముఖ్యమంత్రిగా పినరాయి విజయన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పాల్గొన్న ఈ కీలక సమావేశంలో విజయన్ ను సిఎంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో విజయన్ కూడా ఉన్నారు. కేరళ నుంచి శాసనసభకు గెలిచిన వారిలో విజయన్ ఒక్కరే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. సిపిఎం నేత అచ్చుతానందన్ కు, సిఎం అభ్యర్ధి విజయన్ కు మధ్య చాలాకాలంగా బేధాభ్రియాలున్నాయి.

దీంతో సిఎంగా విజయన్ పేరు ప్రకటించగానే అచ్చుతానందన్ పోలిట్ బ్యూర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. తనకు కొన్నాళ్లైనా సిఎం పదివి ఇస్తారని అచ్యుతానందన్ ఆశించారు. అయితే ఆ కోరిక తీరకపోవడంతో ఆయన అలిగారు. పార్టీ గెలిచిన 140 స్ధానాల్లో 91 స్ధానాల్లో విజయం వరించడానికి కారణం అచ్యుతానందనే కావడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -