Monday, April 29, 2024
- Advertisement -

వణికిన హైదరాబాద్

- Advertisement -

శనివారం సాయంత్రం. అంత వరకూ మహానగరం హైదరాబాద్ బిజీబిజీగా ఉంది. ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వారు ఉన్నారు. సన్నగా మొదలైన వర్షం. ఆపైన ఈదురుగాలులు. ఇదంతా ఓ అరగంట సేపు. అంతే మహానగరం అతలాకుతలం అయ్యింది. అటు వనస్ధలిపురం నుంచి ఇటు కూకట్ పల్లి దాకా… జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట, దిల్ సుక్ నగర్, చిక్కడపల్లి, మల్కాజిగిరి, అబిడ్స్ ఇలా నగరంలో అన్ని ప్రాంతాలను గాలులు, వర్షం ముంచెత్తాయి. ఈ హఠత్ దెబ్బకు నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్లు కూలాయి.

కార్లు దెబ్బతిన్నాయి. 150 విద్యుత్ స్ధంబాలు నేలకొరిగాయి. 250 విద్యుత్ ఫీడర్లు, ఆరు ట్రాన్స్ ఫార్మర్లు, 125 హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఈ విధ్వంసంలో 500 వాహనాలు దెబ్బతింటే ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ బాభత్సానికి సగం నగరం అంధకారంలో ఉంది. అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని, చెట్ల కింద ఉండరాదంటూ జిహెచ్ ఎంసి ప్రకటించింది. ఈ గాలులు, వర్షానికి శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

అలాగే ఇక్కడి నుంచి పలు ప్రదేశాలకు వెళ్లాల్సిన విమానాలను కూడా రద్దు చేశారు. జంటనగరాలలో గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని బేగంపేటలోని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ ను వణికించిన రోను తుపాను ప్రభావం హైదరాబాద్ మీద పడలేదని తెలిపింది. శనివారం రాత్రి 8 గంటల వరకూ 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -