Sunday, May 11, 2025
- Advertisement -

అధికారులకు దిశానిర్దేశం చేసిన యనమల

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జిల్లా కలెక్టర్లు పోటీ పడాలని, ఒకరిని మించి ఒకరు పని చేసి రాష్ట్రాని అభివృద్ధి బాటలో నడిచేలా చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి రేటు ఒకేలా ఉందని తెలిపారు.

అన్ని జిల్లాల్లోనూ 11 శాతం అభివృద్ధి రేటు సాధించాం. పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం ముందుంది అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్ల పాత్ర కీలకమని, దీన్ని బట్టి అధికారులు పోటీ పడి పని చేయాలన్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న మండలాల కంటే బలహీనంగా ఉన్న మండలాలను కలెక్టర్లు గుర్తించి వాటి అభివృద్ధికి మార్గాలు అన్వేషించాలని మంత్రి యనమల సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -