Friday, May 3, 2024
- Advertisement -

ఏపీ మరో నైజీరియా అవుతుందట ?

- Advertisement -

ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మద్య విమర్శ, ప్రతి విమర్శలు ఉండడం సహజం. ఒక పార్టీ విధానాలను మరో పార్టీ తప్పుబడుతూ నానా రచ్చ చేస్తూ ఉంటారు రాజకీయ నేతలు.. ఆవిధంగా వారు చేసే కొన్ని వ్యాఖ్యలు అప్పుడప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఆ కోవలోనే ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్ర ప్రదేశ్ ను నైజీరియా తో పొలుస్తూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాగ్ విడుదల చేసిన నివేదికల ప్రకారం అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు యనమల.

జగన్ అధికరంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, అన్నీ రంగాల్లోనూ అభివృద్ది శూన్యం అని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు, పెట్టుబడుల ఆకర్షణకు కొదువే ఉండేది కాదన్న ఆయన.. జగన్ హయాంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ మూడున్నర సంవత్సరాలలో జగన్ సర్కార్ రాష్ట్రంపై 8 లక్షల కోట్ల వరకు రుణభారం ఉంచారని, అయినప్పటికి ఎలాంటి అభివృద్ది జరగలేదని యనమల చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరో నైజీరియా దేశంలా తయారయ్యే రోజు దగ్గర్లోనే ఉందని యనమల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి యనమల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

Also Read

రాహుల్ వస్తేనే ప్రత్యేక హోదా.. నమ్మల్నా ?

జగన్ సార్.. ఈ విషయంలో సూపర్ !

బాలయ్య షోలో చంద్రబాబు.. పోలిటికల్ వ్యూహమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -