ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరికి నచ్చినట్లు వారు సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. తన తండ్రి జీవిత కథను కథానాయకుడు,మహనాయకుడు సినిమాలుగా తెరకెక్కించాడు హీరో బాలకృష్ణ. ఇక వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితం, ఆయన భార్య లక్ష్మీపార్వతిపై దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేశాడు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. నాదెండ్ల భాస్కరరావు ఇటీవల రామారావు గురించి మాట్లాడిన మాటలను తన ట్రైలర్‌లో చూపించాడు కేతిరెడ్డి. ఎన్టీఆర్‌పై ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా లక్ష్మీపార్వతి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో మునిగిపోయారు. దీనిపై ఎన్టీఆర్ ఆవేదన చెందుతున్నట్లు ట్రైలర్‌ను కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది.
- ‘ఎల్లమ్మ’ నుంచి క్రేజీ అప్డేట్!
- ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ!
- భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా..
- ఓటీటీకి వచ్చేస్తోన్న ‘కాక్టెయిల్ 2’!
- ‘కొరియన్ కనకరాజు’.. మరో డిఫరెంట్ ఎంటర్టైనర్!
