ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంలోని ప్రముఖ ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మాళయాళ సూపర్‌స్టార్ మమ్మూట్టి నటించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడట్ను పెంచేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మమ్మూట్టి పాల్గొన్నారు. సినిమా విశేషాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు మమ్మూట్టి.
సినిమా కథ వినగానే ఇది నేను చేయాల్సిన సినిమా అని మెంటల్ ఫిక్స్ అయానని తెలిపాడు. అంతకు ముందు వైఎస్ఆర్ గురించి నాకు తెలియదని ,సినిమా చేసే సమయంలోనే ఆయన గొప్పతనం తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన పాదయాత్ర చూసి ,అచ్చం ఆయనలా చేయడానికి ప్రయత్నించానని చూసి ఎలా ఉందో ప్రేక్షకులే చెప్పాలని కోరాడు మమ్మూట్టి. వైఎస్ఆర్లా చేతులు ఊపడం కష్టంగా అనిపించిందని ఆయన పెర్కొన్నారు. ఇక ఈ సినిమాను తెలుగు,మళయాళ భాషలలో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. జగపతి బాబు,అనసూయలు సినిమాలోని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- భార్య, కుమార్తెలను హతమార్చి టీ తాగి పరారైన తండ్రి!
- వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!
- అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా సిద్ధం!
- స్పిరిట్ ను టార్గెట్ చేయాలని ఛాలెంజ్!
- ‘ది ప్యారడైజ్’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!
