Monday, May 6, 2024
- Advertisement -

ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న‌ లేద‌ట‌.. మ‌రి ఎలాంటి ఆలోచ‌న ఉందో..?

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్స్ వ‌రుస‌గా పెళ్లిల్లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్‌,అనుష్క శ‌ర్మ వంటి వారు వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌ని మీడియా పలువురిని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రశ్నే హీరోయిన్ త‌మ‌న్నాకు ఎదురైంది. తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది.

అప్పుడప్పుడు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసినప్ప‌టికి హిట్లు మాత్రం రాలేదు. ఇటీవ‌లే వెంక‌టేశ్‌తో న‌టించిన ఎఫ్‌2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇదేకాక చిరంజీవి తదుపరి చిత్రంలో కూడా తమన్నా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తమిళంలో ప్రభుదేవాతో దేవి – 2 చిత్రంలో నటిస్తోంది తమన్నా. ఉదయనిధిస్టాలిన్‌తో జతకట్టిన ‘కన్నె కలైమానే’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన త‌మ‌న్నా..తాను ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోన‌ని తెలిపింది. నాకు ఇప్పుడే పెళ్లి ఏంటని మీడియానే ఎదురు ప్ర‌శ్నిస్తుంది. నా వయసింకా 29దేగా అని దీర్ఘాలు తీస్తుంది. మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదు అని కూడా చెప్పుకొచ్చింది ఈ స్టార్ హీరోయిన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -