అధికార పక్ష నేతలు ఎక్కడైనా తాము చేసిన అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష నేతపై బురద జల్లుతూ ప్రచారం చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు ప్రచారం ఏంటీ అనుకోకండి.. చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం ప్రారంభించారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ మధ్య ఏపీ సీఎం చంద్రబాబుకు, లోకేష్‌కు, అంతేంతుకు ఏ టీడీపీ నేతకైనా కల్లో కూడా గుర్తొచ్చే పేరు, కనిపించే రూపం వైఎస్ జగన్ అంటున్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు.
అందుకు తగ్గట్టుగానే ఉంటున్నాయి తెలుగు తమ్ముళ్ల పనులు. చినబాబు ఎలాగైనా జగన్ .. జగన్ అంటున్నారుగా.. ఆయన వచ్చే సభల్లో కూడా జగన్ ఫోటోలతో ఉన్న కుర్చీలు వేస్తే పోలా అనుకున్నారేమో.. తిరుపతి సభకు జగన్ స్టిక్కర్ ఉన్న కుర్చీలు వేశారు. వాటిపై రావాలి జగన్.. కావాలి జగన్ అనే స్లోగన్ కూడా ఉంది.
వీటిని గమనించిన మీడియా వెంటనే తమ కెమెరాలను అక్కడ ఫోకస్ చేశాయి. చినబాబు సభలో జగన్ కుర్చీలు అంటూ వార్తలు రాగానే అలర్టయ్యారు సభ నిర్వాహకులు. వెంటనే అప్రమత్తమై ఆ కుర్చీలను సభా ప్రాంగణం నుంచి తొలగించారు. ఆ తరువాత టీడీపీ పెద్దలు నాలుగు అక్షింతలు కూడా వేశారట.
ఇంతకి విషయం ఏమీటంటే రెండ్రోజుల క్రితం తిరుపతిలో జగన్ ‘సమర శంఖారావం’ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఏ కుర్చీలైతే వేశారో.. వాటినే టీడీపీ సభకు తీసుకు రావడంతో ఇదంతా జరిగింది. ఏదేమైనా చినబాబు మనసులో, మాటలో, సభలో ఎక్కడ చూసిన జగనే కనిపిస్తూ.. వినిపిస్తూ ఉన్నారు.