Monday, April 29, 2024
- Advertisement -

ధోనీతోనే ఆట‌లా…

- Advertisement -

భార‌త మాజీ కెప్టెన్ వికెట్ కీప‌ర్ ధోని వికెట్ల వెనుక ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో తెలిసిందే. టీమిండియా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు త‌న వ్యూహంతో ఎన్నోసార్లు జ‌ట్టుకు విజ‌యాలందించాడు. రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20లో ధోని వికెట్ల వెనుకున్న‌ప్పుడు బ్యాట్స్ మెన్‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ఐసీసీ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. స్పిన్న‌ర్ల‌తో వ్యూహాలు ర‌చించి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌ను బోల్టా కొట్టించ‌డంలో ధోని దిట్ట‌. అలాంటి ధోనిని రెండో టీ20లో స్టంప్ ఔట్ చేసేందుకు కివీస్ అమ‌లు చేసిన ప్లాన్ బెడిసికొట్టింది.

ఇద‌లా ఉంటే దోనీలాగా ఓసారి ట్రై చేద్దామని న్యూజిలాండ్ ప్రయత్నించింది. కానీ.. ధోనీ చాకచక్యంతో చివరికి వారికి నిరాశే ఎదురైంది. సింగిల్ ప‌రుగుకూడా వ‌చ్చింది. రెండో టీ20లో 158 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 15.4 ఓవర్లు ముగిసే సమయానికి 133/3తో నిలిచింది. 26 బంతుల్లో 26 ప‌రుగులు చేస్తె భార‌త్ విజ‌యం సాధిస్తుంది. అప్పటికి క్రీజులో రిషబ్ పంత్‌, ధోనీ ఉన్నారు. ధోని వికెట్ తీసి టీమిండియాపై ఒత్తిడి పెంచాల‌ని న్యూజిలాండ్ ప్లాన్ వేసింది.

స్పిన్నర్ ఇస్ సోధీని రంగంలోకి దింపిన న్యూజిలాండ్‌.. ప్లైటెడ్ డెలివరీలతో ధోనీని ఊరించే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్ ప్లాన్ ప‌సిగ‌ట్టిన ధోని చాక‌చ‌క్యంగా ఔట్ అయ్యే ప్ర‌మాదంనుంచి త‌ప్పించుకున్నారు. ధోనినీ ఔట్ చేసేందుకు ఆఫ‌స్టంప్ వెలుప‌ల బంతిని విసిరిన బంతిని ముందుకొచ్చి హిట్ చేయ‌బోయిన ధోని..బంతి ఊహించని విధంగా రావడంతో ఆఖరి క్షణంలో బ్యాట్‌తో అడ్డుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -