Friday, May 9, 2025
- Advertisement -

రెండు నామినేషన్లే దాఖలు

- Advertisement -

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నామినేషన్లు వేసిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల ఎన్నిక ఇక లాంచనమే. మంగళవారం ఉదయం వీరిద్దరు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం మించిపోతున్నా మరో పార్టీ నుంచి ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

దీంతో డి.ఎస్, లక్ష్మీకాంతరావుల ఎన్నిక లాంఛనమే అయ్యింది. వీరిద్దరి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే మంత్రి హరీష్ రావ్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు వచ్చే హరీష్ రావు దీనికి రాకపొవడంతో కార్యకర్తలు, నాయకులు గుసగుసలాడుకున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -