- Advertisement -

అలా అయితే.. బాబు మాజీ రాక్షసుడా..!

- Advertisement -

మహానాడులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెచ్చిపోయారు. ఆత్మస్తుతి పరనిందలా జరిగిన ఈ కార్యక్రమంలో బాబు తమ రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు..

దాదాపుగా తెలుగుదేశం నేతలు అంతా ఇదే పనిచేశారు. పోటీలు పడి రాజకీయ ప్రత్యర్థులును విమర్శించారు, చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. మరి వారందరి మాటలూ అలా ఉంటే.. స్వయంగా చంద్రబాబు రెచ్చిపోయిన తీరు మాత్రం కొంత విడ్డూరంగా ఉంది!

అది కూడా బాబు తమ రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి ఉపయోగించిన మాటలే విడ్డూరంగా ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష పార్టీలు ‘రాక్షసుల్లా” అడ్డుపడుతున్నారు అని అన్నారు తెలుగుదేశం అధినేత. మరి రాజకీయాలు అన్నాకా విమర్శలు మామూలే.. అది కూడా విధానపరమైన విమర్శలను ఎవరైనా స్వాగతించాల్సిందే. రాజధాని వ్యవహారంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా అందరికీ తెలిసిందే! బాబు ఈ విషయంలో తన అభిప్రాయాలకు.. తన వారి మాటలకు తప్ప మరెవరికీ ప్రాధాన్యతను ఇవ్వడం లేదు!

ఆఖరికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కూడా బాబు ఎలా బుట్టదాఖలు చేశాడో అందరికీ తెలిసిందే! మరి ఇలా ఒంటెత్తు పోకడతో ముందుకు వెళుతున్న తెలుగుదేశం అధినేత ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలను ఏకంగా ‘రాక్షసులు’ అనేశాడు. మరి బాబు ఏమీ ఎప్పుడూ అధికారంలో లేడు.. ఈయన కూడా గతంలో ప్రతిపక్ష నేతగానే ఉన్నాడు. ప్రభుత్వాలపై అనేక విమర్శలు చేశాడు. మరి బాబు అప్పట్లో ఎలాంటి విమర్శలు చేశాడో.. ఇప్పటి ప్రతిపక్షాలు కూడా బాబుపై అలాంటి విమర్శలే చేస్తున్నాయి. అంత మాత్రానికే వారిని ఏకంగా ‘రాక్షసులు’ అనేస్తే.. బాబును మాజీ రాక్షసుడు అనుకోవాలా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -