Thursday, May 16, 2024
- Advertisement -

కేసీఆర్ ‘అసెంబ్లీ రద్దు’ హెచ్చరిక వెనుక అసలు కథ ఇది..!

- Advertisement -

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే అసెంబ్లీని రద్దు చేస్తా..’ అంటూ పార్టీ నేతలకు తీవ్రమైన హెచ్చరికనే జారీ చేశాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.

మరి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడైదానా కాలేదు.. అప్పుడే అసెంబ్లీ రద్దు ఏమిటి? అధికారాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా అది? అనే సందేహాలు వస్తాయెవరికైనా. అసలు కేసీఆర్ ఒక ఎమ్మెల్సీ సీటు విషయంలో అంత తీవ్రమైన హెచ్చరిక చేయడం ఏమిటి?! అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు. మరి ఈ హెచ్చరిక వెనుక చాలా కథే ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర సమితిలోని అంతర్గత పరిస్థితిని అర్థం చేసుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రకటన చేశాడని విశ్లేషకులు అంటున్నారు. పార్టీ నేతల తీరుతో భయపడే కేసీఆర్ అసెంబ్లీ రద్దు హెచ్చరిక చేశాడని కూడా తెలుస్తోంది. శాసనమండలి సభ్యుల ఎన్నికలో సొంతంగా బలం లేకపోయినా ఐదో అభ్యర్థిని బరిలో నిలిపిన కేసీఆర్ కు ఆ అభ్యర్థి గెలుపు సందేహంగా మారింది. దీనికి కారణం పార్టీ ఎమ్మెల్యేలే! ఇప్పుడు ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిగనుక గెలిస్తే.. అతడు తమ మంత్రి పదవికి అడ్డు అవుతాడని వారు లెక్కలేసుకొన్నారు.

అందుకే.. పార్టీ తరపున నిలబడ్డ ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించడానికే వారు నిర్ణయించుకొన్నట్టుగా తెలుస్తోంది. అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నా.. తెరాస ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కంకణం కట్టుకొన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలోని తన నెట్ వర్క్ ద్వారా ఈ అంశాన్ని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. పార్టీ మీటింగ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇలాంటి కుటిల ప్లానింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలకు ఆయన గట్టిగా హెచ్చరిక చేశాడు. ఐదో అభ్యర్థి గనుక ఓడిపోతే అసెంబ్లీరద్దుకు కూడా వెనుకాడను అంటూ తీవ్రమైన హెచ్చరిక చేసి కేసీఆర్ పార్టీ నేతలను గాడిన పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. మరి ఈ ప్రయత్నం ఏ మేరకు విజయవంతం అవుతుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -