బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు తొలి హిట్ అందుకోలేదు. అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచియం అయిన బెల్లంకొండ వరుస సినిమాలు చేస్తున్నప్పటికి కూడా హిట్లు మాత్రం రావడం లేదు.ఆ మధ్య బోయపాటితో కలిసి జయ జానికి నాయక సినిమా చేశాడు బెల్లకొండ. ఈ సినిమా మాత్రం కాస్తా యావరేజ్‌గా ఆడింది. ఇటీవలే భారీ బడ్జెట్‌తో సాక్ష్యం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బెల్లకొండకు తీవ్ర నిరాశను మిగల్చడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇన్ని ఫ్లాప్‌లు వస్తున్న బెల్లకొండకు వరుస అవకాశాలు వస్తునే ఉన్నాయి. బెల్లకొండ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బెల్లకొండ. తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ను తెలుగులో రీమేక్ చేయలని భావిస్తున్నాడు.సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడనికి రెడీ అవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ను ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారని టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హైట్‌కు , అనుపమా పరమేశ్వరన్ హైట్‌కు చాలా తేడా ఉంది. మరి మధ్య రొమాన్స్ వర్క్ అవుట్ అవుతుందని దర్శక-నిర్మాతలు ఎలా భావిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ వార్తలో ఎంత నిజమో తెలియాలంటే.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే
- Advertisement -
బెల్లంకొండ శ్రీనివాస్ హైట్ ఎక్కడ..అనుపమా పరమేశ్వరన్ హైట్ ఎక్కడ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -