బిగ్‌బాస్ రెండో సీజన్‌లో కౌశల్ విన్నర్‌గా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే. అతను బిగ్‌బాస్ టైటిల్‌ను గెలవడంతో అతని పేరిట ఏర్పడిన ఆర్మీ కీలక పాత్ర పోషించింది. అయితే అప్పట్లోనే ఇది కౌశల్ పేరిట వచ్చిన అభిమానులు నిజమైన వారు కాదని , వారిని డబ్బులు పెట్టి కొనుగొలు చేశారని బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని వంటి వారు బహిరంగంగానే వెల్లడించారు. తాజాగా కౌశల్ ఆర్మీలో లుకలుకలు బయటపడ్డాయి. కౌశల్‌కు అభిమానులకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కౌశల్ పౌండేషన్‌లోని డబ్బులను తినేస్తున్నాడని ఆర్మీ ఆరోపిస్తోంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో తన భార్యకు నీలిమాకు క్యాన్సర్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. అవును కౌశల్ భార్య నీలిమాకు క్యాన్సరట. ఈ విషయాన్ని స్వయంగా కౌశల్ చెప్పడంలో అందరు ఆశ్చర్యపోయారు.తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతు నాకు సపోర్ట్‌గా ఉండేందుకు ట్రీట్ మెంట్ కూడా తీసుకోకుండా నా వెంట వస్తుందని ఆమెను కూడా వదలకుండా విమర్శించారంటూ కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కడుపులో 7 సెంటీమీటర్ల పొడవున క్యాన్సర్ గడ్డ నొప్పి పెడుతున్నా కూడా నా కోసం తను బాధను భరిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉందని కౌశల్ అన్నాడు.
- Advertisement -
బిగ్‌బాస్ కౌశల్ భార్య నీలిమాకు క్యాన్సరా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -