ఇది బాలీవుడ్ కే కాదు భారత సినీ ప్రపంచంలోనే ఓ పెద్ద రికార్డు. ఓ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటనుకుంటున్నారా. అదే హౌస్ ఫుల్ 3. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్ధ ఈరోస్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశంలో 73.02 కోట్లు, విదేశాల్లో 27.01 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆ సంస్ధ ప్రకటించింది.
ఈ సినిమాకి ఇంత హిట్ ఇచ్చినందుకు చిత్ర హీరో అక్షయ్ కుమార్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేశారు. హౌస్ ఫుల్ 3 సినిమా పూర్తి కామెడీ చిత్రమే అయినా విభిన్నమైన టాక్ వచ్చింది. అయినా కాని బాక్సాఫిస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్లు నమోదు చేసింది. ‘హౌస్‌ఫుల్-3సినిమాకి బాలీవుడ్ దర్శక ద్వయం సాజిద్-ఫర్హాద్ దర్శకత్వం వహించారు. ఇక అక్షయ్‌కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో హీరోలుగా నటించారు. వీరితో పాటు జాక్వాలిన్ ఫెర్రాండెజ్, లిసా హెడెన్, నర్గీస్ ఫక్రీ కూడా ఈ చిత్రంలో నటించారు.