- Advertisement -
ప్రతి ఏటా మ్రగశిర కార్తె ప్రారంభం నాడు ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు ఇచ్చే చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన చేప మందు పంపిణీకి లక్షల సంఖ్యలో రోగులు వచ్చారు. వీరి కోసం మైదానంలో 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ముందుగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి చేప మందును ఇస్తున్నారు. ఆ తర్వాత స్ధానికులకు, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వారికి పంపిణీ చేస్తారు. ఈ పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం ఎనిమిదిన్నర వరకూ కొనసాగుతుంది. చేప మందు కోసం వచ్చిన వారికి ఉచితంగా భోజనం, మంచినీళ్లు అందిస్తున్నారు. దాదాపు 1500 మందితో అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
