నటి హేమ ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. హేమ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది. రుణమాఫీ చేస్తానని చెప్పి ఉంటే జగన్ 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు. అది సాధ్యం కాదని చెప్పి మాట మీద నిలబడ్డారని తెలిపింది హేమ. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా జగన్‌కు ఓ క్లారిటీ ఉందని , కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా చంద్రబాబు హామీని నిలబెట్టుకోలేదని హేమ విమర్శించారు.
గన్ వ్యక్తిత్వం కలిగిన మనిషని, ముక్కుసూటిగా మాట్లాడారని తెలిపారు.అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేయకూడదని జగన్ భావిస్తున్నారని ,ఈ విషయంలోనే ఆయన నాకు బాగా నచ్చారని తెలిపింది హేమ. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయం అని హేమ జోస్యం చెప్పింది. అందరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయలని విజ్ఞప్తి చేసింది.
- Advertisement -
జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన నటి హేమ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
