Thursday, May 16, 2024
- Advertisement -

చంద్ర‌బాబు జ ‘గన్’ వ్యాఖ్య‌ల‌కు విజ‌య‌సాయి ఘాటు కౌంట‌ర్‌

- Advertisement -

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబుపై ట్విట్ట‌ర్‌లో తూటాలు పేల్చుతున్నారు. బాబు జ‌గ‌న్‌పై చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్లు ఇస్తున్నారు. తాజాగా మ‌రో సారి బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. జ‌గ‌న్ లోనె గ‌న్ ఉంద‌ని అలాంటి వారు అధికారంలోకి వ‌స్తే అరాచ‌కాలు చెల‌రేగుతాయ‌ని బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు విజ‌య‌సాయి కౌంట‌ర్ ఇచ్చారు. చంద్రబాబు పేరులో ‘ద్ర’ అంటే దరిద్రమని ప్రజలంతా చెప్పుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు . జగన్ పేరులో గన్ ఉందన్న విషయాన్ని చంద్రబాబు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిబెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెంట తుపాన్లు కరవు కాటకాలు కాచుకుని ఉంటాయని ఎద్దేవ చేశారు. జనాలు నవ్వుకుంటారన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబు వణుకుతూ ఏదో గొణుగుతున్నారని వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -