తెలుగు వాడి ఆత్మగౌరవం నిలిపిన ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతూ ఉంటె ఒక పక్క చంద్రబాబు మాత్రం తన మామ పాటించిన ” తెలుగు వాడు ” సూత్రం పక్కన పెట్టేసి ప్రతీ దానికి ఫారిన్ వారిదగ్గరకి వెళుతున్నారు. కారు షెడ్డు వెయ్యాలి అన్నా కూడా సింగపూర్ – జపాన్ అంటూ డిజైన్ లు అక్కడ నుంచి గీయించుకుని రావడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. త్రీడీ చిత్రాలతో జనాలని మోసం చెయ్యడం ఆపాలి అంటూ విపక్షాలు సీరియస్ అవుతున్నాయి.
అమరావతి డిజైన్ ల కోసం ఇప్పటి వరకూ ఎన్నో దేశాలు తిరిగారు కానీ ఇంతవరకూ అమరావతి లో ఒక్క రాయి కూడా కదలలేదు. దాంతో చిరాకు వచ్చిన జనాలు చంద్రబాబు చూపించే పై పై నాటకం నమ్మాడం మానేసారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల ఏర్పాటు కోసం ప్లాన్ లు అంటూ మళ్ళీ విదేశాల పడుతున్నారు బాబు గారు. చైనాకు చెందిన గిజ్ హౌ ఇంటర్నేషనల్ సంస్థ ఈ ప్లాన్లు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ఇంత చిన్న విషయానికి కూడా తెలుగువారిని ఉపయోగించడం లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
అమరావతి పోనీ ప్రపంచ స్థాయి నగరం అంటునారు కాబట్టి ఏమో అనుకోవచ్చు కేవలం 12 రోజులు జరిగే కృష్ణా పుష్కరాల గురించి తన దగ్గర ఉన్న వారిని వదిలేసి ఎక్కడో అమెరికా చైనా జపాన్ అంటారో ఏంటో బాబుగారు అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బొమ్మలు గీసి హడావుడి చేయడం కంటే ఏర్పాట్లు సక్రమంగా చేయడంపై దృష్టి పెట్టాలని ప్రజలు కూడా సూచిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు కూడా నానా హడావుడి చేసి చివరకు ప్రజల ప్రాణాలు పోయేలా చేశారని అంటున్నారు.