Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబు కు షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు !

- Advertisement -

ప్రస్తుతం టీడీపీ పరిస్థితి గతంలో మాదిరిగా లేదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమితో ఆ పార్టీ మరింత డీలా పడింది. ఇక ప్రస్తుతం టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే పనిలో చంద్రబాబు తమమునలై ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని ధృడ నిశ్చయంతో ఉన్న చంద్రబాబు ఇప్పటికే ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉన్నారు. అంతే కాకుండా టీడీపీ నేతలు కూడా ప్రజల్లో ఉంటూ నియోజిక వర్గాల్లో యాక్టివ్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇతవరకు బాగానే ఉన్నప్పటికి సొంత పార్టీ నేతలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై పెదవి విరుస్తుండడం చంద్రబాబు కు ఏమాత్రం మింగుడు పడడం లేదట.

ఆ మద్య టీడీపీ కీలక నేత అచ్చేన్నాయుడు టీడీపీ బలపడడం కష్టమే అని చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో దర్శనమిచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో టీడీపీ కార్యకర్తలను కాస్త కలవరపెట్టిందనే చెప్పాలి. ఇక తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా ఇలాంటి వ్యాఖ్యాలే చేయడం ఆసక్తికరంగా మారింది. ” టీడీపీలోని ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కునే అవకాశం ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు కష్టమే అనే రీతిలో వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో 50-60 సీట్లు కూడా టీడీపీకి రావడం కష్టమే అని కేశినేని నాని అన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వ్నిపిస్తున్నాయి.

దాంతో సొంత పార్టీ నేతలే టీడీపీ గెలుపు పట్ల ధీమా లేకపోవడంతో చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించకపోతే.. ఆ పార్టీ స్థితిగతులే మారిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రాబోయే 2024 ఎన్నికలు కీలకం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పార్టీ నేతల్లో బలాన్ని నింపి గెలుపుపై ధీమా పెంచే విధంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తే బాగుంటుందని కొందరి ఆలోచన. మరి పార్టీని తిరిగి బలోపేతం చేయడంలోను, సరికొత్త ప్రణాళికలు రచిందడంలోను చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

More Like This

రఘురామ చూపు.. పవన్ వైపు ?

కే‌సి‌ఆర్ మద్దతు.. ఎటువైపు ?

వారి సైలెన్స్ వెనుక.. కారణం ఆదేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -