Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా ?

- Advertisement -

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తి. కాంగ్రెస్, బీజేపీ వంటి బలమైన జాతీయ పార్టీలకు ఆంద్రప్రదేశ్ లో టీడీపీ మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత సీన్ మారిపోయింది. తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగితే టీడీపీ ఆంధ్రకు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ మెల్ల మెల్లగా పట్టు కోల్పోతు వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి టీడీపీ లో ఉన్నప్పుడూ ఆ పార్టీ కాస్త బలంగానే కనిపించినప్పటికి..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత టీడీపీ పూర్తిగా బలహీన పడిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణాలో టీడీపీ ఊసే లేదు.

అయితే తాజాగా చంద్రబాబు వైకరి చూస్తుంటే మళ్ళీ తెలంగాణపై ఫోకస్ పెట్టడా ? అనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన పోలవరం ముంపు గ్రామాలను సందర్శించిన చంద్రబాబు.. ఆ తరువాత ఖమ్మం జిల్లాలోని టీడీపీ నేతలతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి బాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట వంటి నియోజిక వర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే పార్టీ యాక్టివ్ గా లేని కారణంగా టీడీపీ తరుపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావ్ వంటి వారు టి‌ఆర్‌ఎస్ లో చేరిపోయారు.

దీంతో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పూర్తిగా నిష్క్రమించిందనే వాదనలు బలంగానే వినిపించాయి. అయితే తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు సిద్దమైనట్లుగా టి‌ఎస్ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అందులో బాగంగానే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరుపున కొందరు నేతలను బరిలో దించనున్నారట. అంతేకాకుండ తెలంగాణలో కూడా భాహిరంగ సభలు నిర్వహించి మసకబారిన పసుపు జెండాను మళ్ళీ రెపరెపలాడించాలని చంద్రబాబు చూస్తున్నారట. మరి ప్రస్తుతం తెలంగాణలో టి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ టీడీపీ బరిలోకి దిగితే ఆ పార్టీలకు ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి.

Also Read

బాబుకి మోడి పిలుపు.. కారణం ఆదేనా ?

కే‌సి‌ఆర్ రహస్య ప్రయాణం.. ఎందుకో ?

మోడీ-షా నెక్స్ట్ టార్గెట్ ఆదేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -